ఏపీ ప్రభుత్వానికి బిగ్‌ షాక్‌ ఇచ్చిన గ్రామ, వార్డు సెక్రటరీలు

ABN , First Publish Date - 2022-01-08T19:59:00+05:30 IST

ఏపీ ప్రభుత్వానికి గ్రామ, వార్డు సెక్రటరీలు బిగ్‌షాక్‌ ఇచ్చారు. ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయనందుకు నిరసనగా వాట్సాప్‌ గ్రూపుల నుంచి గ్రామ, వార్డు సెక్రటరీలు ఎగ్జిట్‌ అవుతున్నారు.

ఏపీ ప్రభుత్వానికి బిగ్‌ షాక్‌ ఇచ్చిన గ్రామ, వార్డు సెక్రటరీలు

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి గ్రామ, వార్డు సెక్రటరీలు బిగ్‌షాక్‌ ఇచ్చారు. ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయనందుకు నిరసనగా వాట్సాప్‌ గ్రూపుల నుంచి గ్రామ, వార్డు సెక్రటరీలు ఎగ్జిట్‌ అవుతున్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారి అడ్మిన్‌గా ఉండే గ్రూపుల్లో నుంచి ఉద్యోగులు ఎగ్జిట్‌ అయ్యారు. గత ఏడాది ఆగస్టులో ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాల్సి ఉండగా నేటి వరకూ ప్రభుత్వం చేయలేదు. నిన్న సీఎం జగన్ పీఆర్‌సీ ప్రకటనలో జూన్‌ ఆఖరులో చేస్తామని చెప్పడంతో నిరసనకు దిగారు. గ్రూపుల నుంచి ఎగ్జిట్‌ కావడంతో ప్రభుత్వ ఆదేశాలు ఎవరికి ఇవ్వాలో అర్ధంకాక అయోమయం చెందుతున్నారు. గ్రూపుల నుంచి ఎగ్జిట్‌ అవుతున్న కార్యదర్శులతో వెంటనే మాట్లాడాలని జిల్లా అధికారులను స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌ ఆదేశించారు. వారికి నచ్చజెప్పాలని అధికారులకు అజయ్‌ జైన్‌ ఆదేశాలు జారీ చేశారు. మాట వినకపోతే కఠిన చర్యలు ఉంటామని హెచ్చరించారు. జిల్లా అధికారులకు అజయ్‌ జైన్‌ వాట్సాప్‌ సందేశం పంపారు.

Updated Date - 2022-01-08T19:59:00+05:30 IST