బైగన్‌ బర్తా

ABN , First Publish Date - 2020-10-17T17:58:49+05:30 IST

వంకాయలు- 600గ్రా. ఉల్లిపాయ ముక్కలు- 100 గ్రా. టొమాటో ముక్కలు- 100గ్రా. తరిగిన అల్లం- 20గ్రా. తరగిన పచ్చిమిర్చి- 50 గ్రా. కారంపొడి- 50 గ్రా. ఆముదం న

బైగన్‌ బర్తా

కావలసినవి: వంకాయలు- 600గ్రా. ఉల్లిపాయ ముక్కలు- 100 గ్రా. టొమాటో ముక్కలు- 100గ్రా. తరిగిన అల్లం- 20గ్రా. తరగిన పచ్చిమిర్చి- 50 గ్రా. కారంపొడి- 50 గ్రా. ఆముదం నూనె- 50 ఎం.ఎల్‌, ఉప్పు- రుచికి సరిపడా.


తయారీ విధానం: వంకాయలను శుభ్రంగా కడిగి, వాటికి నూనె రాసి, వేపుడికి సిద్ధంగా పెట్టుకోవాలి. పాన్‌లో వంకాయలను రెండు నిమిషా పాటు వేగించాలి. ఇప్పుడు వంకాయల పైతోలు తొలగించి వాటిని ముక్కలుగా కోయాలి. పాన్‌లో నూనె వేసి వేడిక్కిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వేయాలి. ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగులోకి మారిన తరవాత వంకాయ ముక్కల పేస్ట్‌ వేయాలి. టొమాటో ముక్కలు, ఉప్పు, ఆముదం నూనె వే యాలి కొద్దిసేపు మంట మీద ఉంచాలి. చివరగా కొత్తిమీర చల్లుకొని సర్వ్‌చేయాలి. 





Updated Date - 2020-10-17T17:58:49+05:30 IST