Bigg Boss 16: సోషల్ మీడియాలో లీక్ అయిన బిగ్ బాస్ సెట్ ఫొటోలు

Published: Sat, 06 Aug 2022 15:23:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Bigg Boss 16: సోషల్ మీడియాలో లీక్ అయిన బిగ్ బాస్ సెట్ ఫొటోలు

బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఒకరు. అతడికీ మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘బిగ్‌ బాస్’ (Bigg Boss) షోను సల్లూ భాయ్ 13ఏళ్లుగా హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ షో 15సీజన్‌లు ప్రసారమయ్యి ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. త్వరలోనే 16వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీజన్‌ను కూడా బాలీవుడ్ భాయ్‌జానే హోస్ట్ చేయనుండటంతో షోపై అంచనాలు ఆకాశంటుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ సెట్‌కు సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా కూడా ఇదేనంటూ పుకార్లు షికార్లు కొడుతున్నాయి.  


బిగ్‌ బాస్-16లో అంకితా లోఖండే, దిశా పర్మార్, షైనీ అహుజా, మున్వార్ ఫారూకీ, సాయిషా షిండే, అంజలి అరోరా, కనికా మన్, ప్రాచీ దేశాయ్, వివియన్ ద్సేనా తదితరులు పాల్గొనబోతున్నారని సమాచారం. అక్టోబర్ 1నుంచి బిగ్ బాస్-16 ప్రసారం కాబోతున్నట్టు తెలుస్తోంది. కానీ, మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటనను జారీ చేయలేదు. గతేడాది బిగ్ బాస్ సీజన్ అడవి థీమ్‌తో జరగగా, ఈ ఏడాది ఆక్వా థీమ్‌లో జరగనున్నట్టు లీక్ అయిన పిక్స్‌ను బట్టి తెలుస్తోంది. బిగ్ బాస్-16ను హోస్ట్ చేయడానికీ సల్మాన్ రూ. 1000కోట్లను రెమ్యూనరేషన్‌గా అడుగుతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. గతంలో అతడికీ సరైన స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచలేదని, అందుకే పారితోషికం పెంపుపై సల్మాన్ మొండిగా ఉన్నాడట. కానీ, సల్మాన్ ఖాన్‌కు ఎంత పారితోషికం ఆఫర్ చేసి ఈ షోకు తీసుకువచ్చారో నిర్మాతలకే తెలియాలి. 




Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...