
సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్ 14కు టాలెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తోన్న పిస్తా ధాకడ్(24) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివరాల మేరకు బిగ్‌బాస్ 14 సీజన్‌కు సంబంధించిన వారాంతపు చిత్రీకరణను పూర్తి చేసుకుని అసిస్టెంట్‌తో కలిసి ఇంటికి వెళుతుండగా స్కూటీ అదుపుతప్పడంతో పిస్తా ధాకడ్, ఆమె అసిస్టెంట్ కిందపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వ్యానిటీ వ్యాన్ వారిపై నుండి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పిస్తా ధాకర్ అక్కడే మృతి చెందగా, అసిస్టెంట్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది. పిస్తా ధాకడ్ మరణంపై సినీ ప్రముఖులు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.