మరో ‘బిగ్‌ బాస్‌’ నటికి కరోనా పాజిటివ్

Published: Fri, 21 Jan 2022 21:45:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మరో బిగ్‌ బాస్‌ నటికి కరోనా పాజిటివ్

ఇటీవల ‘బిగ్ బాస్’ తెలుగు ఫేమ్ సిరి కరోనా పాజిటివ్‌కి గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘బిగ్‌ బాస్‌’ తమిళ సీజన్‌-5 ఫేమ్ పావనికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తెలుగులో పలు చిత్రాలు, సీరియల్స్‌లో నటించిన పావని.. తమిళంలో ‘రెట్టై వాల్‌ కురివి’ అనే సీరియల్ ద్వారా పరిచయమైంది. తాజాగా ‘బిగ్‌ బాస్‌’ తమిళ సీజన్‌-5లో పాల్గొన్న ఆమె, ప్రజల ఆదరాభిమానాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో, పావని తన ఇన్‌‌స్టాగ్రామ్‌లో.. తనకు పాజిటివ్‌ నిర్ధారణ అయిందని, స్వల్ప లక్షణాలు కావడంతో వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లుగా తెలియజేసింది.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International