మా నిజాయితీకి అతిపెద్ద రుజువు...CAG నివేదికపై Arvind Kejriwal వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-07-06T18:04:28+05:30 IST

ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కాగ్ నివేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు....

మా నిజాయితీకి అతిపెద్ద రుజువు...CAG నివేదికపై Arvind Kejriwal వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కాగ్ నివేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఆప్ ప్రభుత్వ హయాంలో కాగ్ నివేదిక ఆదాయ మిగులును చూపిస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కాగ్ నివేదిక మా ప్రభుత్వ నిజాయితీకి అతిపెద్ద రుజువు అని సీఎం పేర్కొన్నారు. 2015-16 నుంచి 2019-20 వరకు ఢిల్లీ ప్రభుత్వానికి రెవెన్యూ మిగులు ఉందని కాగ్ నివేదిక పేర్కొంది.ఢిల్లీ ప్రభుత్వం లాభాల్లో నడుస్తోందన్న కాగ్ నివేదికను ఉటంకిస్తూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. ఆప్ నిజాయితీ ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేసిందని సీఎం చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వానికి 2015-16 నుంచి 2019-20 వరకు మిగులు రెవెన్యూ ఉందని మంగళవారం అసెంబ్లీలో సమర్పించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది.అయితే ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.


‘‘మా ఆప్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఢిల్లీ ప్రభుత్వం లాభాల్లో నడుస్తోంది. ఆప్ నిజాయితీకి ఇదే అతిపెద్ద నిదర్శనం. ఈ నిజాయితీ మన ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తోంది’’ అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు.2019-20లో ఢిల్లీ ప్రభుత్వ రెవెన్యూ మిగులు రూ. 7,499 కోట్లుగా ఉందని, ఆదాయ వ్యయాలకు సరిపోయే రెవెన్యూ రాబడులు సరిపోతాయని నివేదిక పేర్కొంది. మార్చి 2020తో ముగిసిన సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కాగ్ నివేదిక, 2021నివేదికను ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అసెంబ్లీ సమావేశంలో సమర్పించారు.




Updated Date - 2022-07-06T18:04:28+05:30 IST