CM Kcr: బీహార్‌లో ప్రధాని మోదీపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-08-31T23:18:57+05:30 IST

సీఎం నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కేసీఆర్....

CM Kcr: బీహార్‌లో ప్రధాని మోదీపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్

Bihar: సీఎం నితీష్ కుమార్ (Cm Nitish Kumar), ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ (Deputy Cm Tejaswi Yadav)తో తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana Cm Kcr) సమావేశం ముగిసింది. గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కేసీఆర్..  సీఎం నితీశ్‌కుమార్‌, డిప్యూటీ సీఎం తేజశ్వి యాదవ్‌ను కలిశారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 8 ఏళ్లలో మోదీ సర్కార్ (Modi Government) చేసిందేమీ లేదన్నారు. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనమైందని మండిపడ్డారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో నష్టపోయిందని.. పేదలు, రైతులు, మహిళలకు మోదీ సర్కార్ ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నించారు. 


‘‘బీజేపీ (Bjp) సర్కార్‌ను సాగనంపాల్సిన అవసరం ఉంది. దేశంలోని నదుల్లో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. 8 ఏళ్లలో దేశం ఏ రంగంలోనూ ప్రగతి సాధించలేదు.  మోదీ నినాదాలు ఒక్కటి కూడా సఫలం కాలేదు. ఒక్క రంగాన్నైనా మోదీ అభివృద్ధి చేశారా?.  2022 నాటికి అందరికీ ఇళ్లు అనే నినాదం ఏమైంది?.’’ అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. 



Updated Date - 2022-08-31T23:18:57+05:30 IST