బెయిల్ కోసం అప్లై చేసిన అత్యాచార నిందితుడు.. వింత షరతులు విధించిన కోర్టు!

Sep 24 2021 @ 11:09AM

అతడు గ్రామంలో బట్టలు ఉతుకుతూ జీవనం సాగించేవాడు.. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో గ్రామానికి చెందిన మహిళపై లైంగిక దాడికి యత్నించాడు.. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతడిని అరెస్ట్ చేశారు.. అప్పటి నుంచి అతడు జైల్లో ఉన్నాడు.. తాజాగా అతని తరఫు న్యాయవాది బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. దీనిపై విచారణ జరిపిన కోర్టు వింత షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది.. బీహార్‌లోని పాట్నా కోర్టు ఈ తీర్పునిచ్చింది. 


ఇవి కూడా చదవండి

బస్టాప్‌ వద్ద అంతా చూస్తుండగా అతడు చేసిన పనికి.. షాకైన జనం



కరోనా వ్యాక్సిన్ కేంద్రం వద్ద డ్రామ.. పంచ్‌లు పేలుస్తున్న నెటిజన్లు


బిహార్‌లోని మజోర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల లాలన్ కుమార్ బట్టలు ఉతుకుతూ జీవనం సాగించేవాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో గ్రామానికి చెందిన మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతడిని అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి అతడు జైలులోనే ఉన్నాడు. తాజాగా అతని తరఫు న్యాయవాది బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసును విచారించిన పాట్నా కోర్టు నిందితుడికి బెయిలు మంజూరు చేసింది. అయితే ఓ వింత షరతు కూడా విధించింది. 


ఆరు నెలల పాటు గ్రామంలోని రెండు వేల మంది మహిళల దుస్తులను లాలన్ ఉచితంగా ఉతికి, ఇస్త్రీ చేయాలని షరతు విధించింది. డిటర్జెంట్లకు, ఇతర అవసరాలకు అయ్యే పూర్తి ఖర్చులను అతడే భరించాలని పేర్కొంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దుచేస్తామని హెచ్చరించింది. కోర్టు తీర్పుపై గ్రామంలోని మహిళలందరూ హర్షం వ్యక్తం చేసినట్లు గ్రామ సర్పంచ్‌ నసీమా ఖాటూన్ తెలిపారు.



Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.