Fake Police Station : 8 నెలలపాటు ఫేక్ పోలీస్ స్టేషన్ నడిపిన ముఠా.. ఎలా దొరికారో తెలుసా..

ABN , First Publish Date - 2022-08-19T03:27:28+05:30 IST

పోలీసుల ముసుగులో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడిన దుండగుల గురించి వినేవుంటారు. కానీ ఓ ముఠా ఓ అడుగు ముందుకేసి ఏకంగా నకిలీ పోలీస్ స్టే

Fake Police Station : 8 నెలలపాటు ఫేక్ పోలీస్ స్టేషన్ నడిపిన ముఠా.. ఎలా దొరికారో తెలుసా..

పాట్నా : పోలీసుల ముసుగులో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడిన దుండగుల గురించి వినేవుంటారు. కానీ ఓ ముఠా ఓ అడుగు ముందుకేసి ఏకంగా నకిలీ పోలీస్ స్టేషనే(Fake police station) ఏర్పాటు చేసింది. ఓ హోటల్‌లో ఏకంగా 8 నెలలపాటు కార్యకలాపాలు కూడా నిర్వహించింది. వినడానికి షాకింగ్ అనిపిస్తున్న ఈ ఘటన బిహార్‌లో వెలుగుచూసింది. అచ్చం పోలీసుల మాదిరిగానే ర్యాంక్ బ్యాడ్జ్‌లతో సహా డ్రెస్ కోడ్ ధరించడంతో ఎవరికీ అనుమానం కలగలేదు. అయితే సర్వీస్‌లో భాగంగా జారీ చేసే ఆయుధాలకు బదులు స్థానికంగా తయారు చేసిన ఆయుధాలతో పోలీస్ డ్రెస్సులో ఉన్న ఇద్దర వ్యక్తులను స్థానిక పోలీస్ అధికారి ఒకరు గుర్తించి.. ఆరా తీయడంతో వ్యవహారం బయటపడింది. మొత్తం ఆరుగురు సభ్యుల ముఠా కాగా ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారని, అందరినీ అరెస్ట్ చేశామని డీసీ శ్రీవాస్తవ ప్రకటించారు. ఓ హోటళ్లలో పోలీస్ స్టేషన్ నిర్వహించారని పేర్కొన్నారు. వీరివద్ద ఒక నిజమైన తుపాకీ కూడా ఉందని వెల్లడించారు. 


ఫిర్యాదులు, కేసులు పెట్టడానికి వచ్చినవారి వద్ద నుంచి డబ్బులు దండుకొని ఉండొచ్చని సందేహం వెలిబుచ్చారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా డబ్బు వసూళ్లు చేసుంటారని ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఈ నెట్‌వర్క్ ఇంకా పెద్దగానే ఉండొచ్చని, దర్యాప్తు చేస్తున్నామని శ్రీవాస్తవ చెప్పారు. కాగా స్థానిక పోలీస్ చీఫ్ నివాసానికి 500 మీటర్ల దూరంలోనే ఈ నకిలీ స్టేషన్‌ని నడిపించడం కొసమెరుపు. 

Updated Date - 2022-08-19T03:27:28+05:30 IST