father కీచకపర్వాన్ని రహస్యంగా వీడియో తీసిన కుమార్తె...shares on social media

ABN , First Publish Date - 2022-05-07T15:32:28+05:30 IST

బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. సాక్షాత్తూ కన్న తండ్రి తనపై చేస్తున్న అత్యాచారం ఘటనను కుమార్తె రహస్యంగా చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన బాగోతం...

father కీచకపర్వాన్ని రహస్యంగా వీడియో తీసిన కుమార్తె...shares on social media

సమస్తిపూర్ (బీహార్): బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. సాక్షాత్తూ కన్న తండ్రి తనపై చేస్తున్న అత్యాచారం ఘటనను కుమార్తె రహస్యంగా చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన బాగోతం తాజాగా బీహార్ రాష్ట్రంలో వెలుగుచూసింది.ఈ దారుణ ఘటన  సంచలనం రేపింది. సమస్తిపూర్ జిల్లాలోని రోసెరా గ్రామానికి చెందిన 50 ఏళ్ల వయసున్న తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తన 18 ఏళ్ల కన్న కూతురిపై అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో తన తండ్రి దురాగతాన్ని బహిర్గతం చేసేందుకు కుమార్తె రహస్య కెమెరాను ఉపయోగించి అత్యాచార ఘటనను వీడియో చిత్రీకరించింది. ఆపై ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు న్యాయం చేయాలని బాలిక వేడుకుంది. 


సోషల్ మీడియా ద్వారా విషయం వెలుగులోకి రావడంతో వీడియో వైరల్ అయింది. దీంతో కుమార్తె ఫిర్యాదు ఆధారంగా కీచక తండ్రిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశామని రోసెరా సబ్ డివిజన్ డీఎస్పీ సహియార్ అక్తర్ చెప్పారు. కీచక తండ్రిని విచారించిన పోలీసులు ఈ కేసులో మరికొందరు నిందితులు ఉన్నారా అనే కోణంలో విచారణ చేపట్టారు. కుమార్తెపై భర్త సాగించిన కీచక పర్వానికి బాధితురాలి తల్లి అభ్యంతరం చెప్పలేదని పోలీసులు చెపుతున్నారు. ఈ సంఘటనపై మౌనంగా ఉండమని ఆమె మామ ఒత్తిడి చేశాడని కూడా ఆరోపణలు ఉన్నాయి.

Read more