Second Marriage Rules: ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవాలంటే.. కొత్త రూల్స్‌ను ప్రకటించిన Bihar సర్కారు

ABN , First Publish Date - 2022-07-15T21:23:40+05:30 IST

పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా అతి ముఖ్యమైన వేడుక. జీవితంలో ఒకసారి జరిగే వేడుక అనే కారణంతో పెళ్లి ఘనంగా చేసుకోవాలని అందరూ భావిస్తారు.

Second Marriage Rules: ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవాలంటే.. కొత్త రూల్స్‌ను ప్రకటించిన Bihar సర్కారు

పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా అతి ముఖ్యమైన వేడుక. జీవితంలో ఒకసారి జరిగే వేడుక అనే కారణంతో పెళ్లి ఘనంగా చేసుకోవాలని అందరూ భావిస్తారు. కానీ, ఇటీవలి కాలంలో మనదేశంలో కూడా విడాకులు,  Second Marriageలు పెరుగుతున్నాయి. అయితే రెండో పెళ్లి విషయంలో Bihar రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది.  ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ కారణం వల్లనైనా రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొంది. రెండో పెళ్లి చేసుకోవాలనుకునే ప్రభుత్వోద్యోగులకు కొన్ని నిబంధనలు రూపొందించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.


ఇది కూడా చదవండి..

మైనర్ బాలుడితో మహిళ Affair.. రాత్రి సమయంలో భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో..


ఎవరైనా ఉద్యోగి తన భాగస్వామి నుంచి విడాకులు తీసుకున్న తర్వాత లేదా జీవిత భాగస్వామి మరణించిన తర్వాత రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందుగా తాము పని చేస్తున్న డిపార్ట్‌మెంట్ హెడ్‌‌కు సమాచారమిచ్చి అనుమతి తీసుకోవాలి. సంబంధిత విభాగం నుంచి అనుమతి వస్తేనే పెళ్లి చేసుకోవాలి.  ప్రభుత్వ ఉద్యోగి/ఉద్యోగిని రెండోసారి పెళ్లి చేసుకోవాలనుకుంటే చట్టపరంగా విడాకులు తీసుకున్నట్లు నిరూపించాలి. అందుకు సంబంధించిన ఆధారాలను డిపార్టుమెంటుకు సమర్పించాలి. ఒకవేళ జీవిత భాగస్వామి మరణిస్తే అందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలి. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మొదటి భార్య/భర్త ఉండగానే, వారికి విడాకులు ఇవ్వకుండా మరొకని వివాహం చేసుకుంటారు. ఇలాంటి కేసుల్లో మొదటి భార్య/భర్త అభ్యంతరం చెప్పడం సహజం.


ఒకవేళ సంబంధిత విభాగం అనుమతి తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్న ఉద్యోగి సర్వీస్‌లో ఉండగానే మరణిస్తే ఆ వ్యక్తి రెండో భార్య/భర్తకు, వారి పిల్లలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు అందవు. అలాంటి వారు వారసత్వంగా వచ్చే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులవుతారు. అలాంటప్పుడు మొదటి భార్య /భర్త ద్వారా పుట్టిన పిల్లలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు.

Updated Date - 2022-07-15T21:23:40+05:30 IST