నిరుపేద రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ : నీతీ ఆయోగ్

ABN , First Publish Date - 2021-11-26T22:51:43+05:30 IST

దేశంలోని నిరుపేద రాష్ట్రాల జాబితాలో బిహార్, జార్ఖండ్, ఉత్తర

నిరుపేద రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ : నీతీ ఆయోగ్

న్యూఢిల్లీ : దేశంలోని నిరుపేద రాష్ట్రాల జాబితాలో బిహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ ఉన్నాయని నీతీ ఆయోగ్ వెల్లడించింది. పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాలుగా కేరళ, గోవా, సిక్కిం, తమిళనాడు, పంజాబ్ నిలిచాయి. బిహార్‌లో 51.91 శాతం మంది, జార్ఖండ్‌లో 42.16 శాతం మంది, ఉత్తర ప్రదేశ్‌‌లో 37.79 శాతం మంది, మధ్య ప్రదేశ్ జనాభాలో 36.65 శాతం మంది పేదలని తెలిపింది. నీతీ ఆయోగ్ విడుదల చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ఈ వివరాలను తెలిపింది. 


ఎంపీఐలో మేఘాలయ ఐదో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలోని జనాభాలో 32.67 శాతం మంది పేదలు ఉన్నట్లు తెలిపింది. నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఈ నివేదిక ముందు మాటలో పేర్కొన్నది ఏమిటంటే, ‘‘భారత దేశ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ)ని అభివృద్ధిపరచడం ప్రభుత్వ విధాన సాధనం ఏర్పాటు దిశగా జరుగుతున్న ముఖ్యమైన కృషి. ఇది బహుముఖ పేదరికాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. సాక్ష్యాధారాల సహితంగా, ప్రత్యేక దృష్టితో కూడిన అంశాలను తెలియజేస్తుంది. తద్వారా ఎవరూ వెనుకబడి ఉండకుండా తగిన చర్యలు తీసుకునేలా తోడ్పడుతుంది.’’ 


జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనం (ఎన్ఎఫ్‌హెచ్ఎస్), 2015-16 ఆధారంగా ఎంపీఐని రూపొందించారు. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, జీవన ప్రమాణాలు వంటి 12 అంశాలను పరిశీలించి దీనిని తయారు చేశారు. 


Updated Date - 2021-11-26T22:51:43+05:30 IST