6 thousand crores: తన అకౌంట్ చెక్ చేసుకున్న బీహార్ వ్యక్తికి షాక్.. ఏకంగా రూ.6 వేల కోట్లు..

ABN , First Publish Date - 2022-08-09T16:08:41+05:30 IST

ఉద్యోగుల తప్పిదం వల్ల, సాంకేతిక లోపాల వల్ల ఒక అకౌంట్‌లోకి వెళ్లాల్సిన డబ్బులు మరొకరి ఖాతాలోకి వెళ్లిపోతుంటాయి.

6 thousand crores: తన అకౌంట్ చెక్ చేసుకున్న బీహార్ వ్యక్తికి షాక్.. ఏకంగా రూ.6 వేల కోట్లు..

ఉద్యోగుల తప్పిదం వల్ల, సాంకేతిక లోపాల వల్ల ఒక అకౌంట్‌లోకి వెళ్లాల్సిన డబ్బులు మరొకరి ఖాతాలోకి వెళ్లిపోతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఉద్యోగులు తమ తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటారు. లేదా వినియోగదారుడి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటారు. తాజాగా బీహార్ (Bihar) వ్యక్తికి చెందిన డీమ్యాట్ అకౌంట్‌ (demat account)లో ఏకంగా రూ.6 వేల కోట్లు (6 thousand crores) జమయ్యాయాయి. అయితే ఆ డబ్బు గురించి ఇప్పటివరకు ఎవ్వరూ సంప్రదించకపోవడం గమనార్హం. 


ఇది కూడా చదవండి..

Kerala: ఒకేసారి తల్లీ కొడుకులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. కేరళలో అరుదైన ఘనత!


లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమాన్ కుమార్ అనే వ్యక్తి వారం రోజుల క్రితం తన డీ మ్యాట్ అకౌంట్‌ను చెక్ చేసుకుని షాకయ్యాడు. ఎందుకంటే అతని ఖాతాలో ఏకంగా రూ.6,833.42 కోట్లు ఉన్నాయి. ఇప్పటికీ ఆ డబ్బులు అతని ఖాతాలోనే ఉన్నాయి. పొరపాటున ఇతని అకౌంట్‌లోకి డబ్బు జమ అయి ఉంటే ఈపాటికే ఎవరో ఒకరు ఫిర్యాదు చేసి ఉండేవారు. ఇప్పటివరకు ఎవరూ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పూర్తి సమాచారం సేకరించే పనిలో స్థానిక పోలీసులు నిమగ్నమయ్యారు.  

Updated Date - 2022-08-09T16:08:41+05:30 IST