తండ్రికి వండి పెట్టేందుకు భార్యను ఇంట్లో ఉంచి ఉపాధికై సిటీకి వెళ్లాడా భర్త.. ఓ షాకింగ్ నిజం తెలిసి తిరిగొచ్చాక..

Jul 26 2021 @ 16:11PM

జీవనోపాధి కోసం పట్టణానికి వెళ్లాలనుకున్నాడు.. ఇంట్లో తండ్రి ఒంటరిగా ఉండిపోతాడని, వండి పెట్టే వాళ్లు ఎవరూ లేరన్న కారణంతో తన భార్యను ఆయనకు తోడుగా ఉంచాడు.. సిటీ నుంచి తిరిగి వచ్చే సరికి అతనికో షాకింగ్ విషయం తెలిసింది.. తండ్రి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది.. ఆగ్రహం వ్యక్తం చేసిన కొడుకును ఆ తండ్రి చంపేసి ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం బయటపెట్టారు.. బీహార్‌లోని పాట్నాలో ఈ ఘటన జరిగింది. 


పాలీగంజ్ ప్రాంతానికి చెందిన సచిన్ ఈ నెల 7వ తేదీన మరణించాడు. దీంతో అతని తండ్రి మిథిలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకును ఎవరో చంపేశారని పేర్కొన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా మిథిలేష్‌కు, అతని కోడలికి వివాహేతర సంబంధం ఉన్నట్టు బయటపడింది. దీంతో మిథిలేష్‌ను, సచిన్ భార్యను పోలీసులు విచారించారు. 


పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతోనే కొడుకు సచిన్‌ను చంపేశానని మిథిలేష్ అంగీకరించాడు. తమ విషయం తెలిసి సిటీ నుంచి తిరిగొచ్చేసిన తర్వాత తమను నిలదీశాడనీ, తమకు అడ్డు తొలగించుకోవాలని క్షణికావేశంలో హత్య చేశానని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు మిథిలేష్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.  

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...