చెల్లిని అత్తారింట్లో దించేందుకు వెళ్లిన అన్న.. అక్కడ ఏం జరిగిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

ABN , First Publish Date - 2022-01-31T22:04:08+05:30 IST

అతను తన చెల్లిని అత్తారింట్లో దిగబెట్టేందుకు వెళ్లాడు.. అక్కడ అనూహ్య పరిస్థితుల్లో చిక్కుకున్నాడు..

చెల్లిని అత్తారింట్లో దించేందుకు వెళ్లిన అన్న.. అక్కడ ఏం జరిగిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

అతను తన చెల్లిని అత్తారింట్లో దిగబెట్టేందుకు వెళ్లాడు.. అక్కడ అనూహ్య పరిస్థితుల్లో చిక్కుకున్నాడు..  ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపు పెళ్లి కొడుకుగా మారాడు.. తనకు ఇష్టం లేకపోయినా ఓ యువతి మెడలో తాళి కట్టాడు.. అనంతరం లబోదిబోమంటున్నాడు.. బీహార్‌లోని  దాల్ సింగ్ స‌రాయిలోని సాతాలో ఈ ఘటన జరిగింది. 


సాతా ప్రాంతానికి చెందిన వినోద్ అనే వ్యక్తి తన చెల్లిని అత్తారింట్లో దింపేందుకు సమస్తిపూర్ వెళ్లాడు. వినోద్ వెళ్లేటప్పటికి చెల్లి అత్తారింట్లో ఆమె ఆడపడుచు వివాహం గురించి చర్చ జరుగుతోంది. ఆమెకు పెళ్లి కావడం లేదని, కట్నం ఎక్కువగా అడుగుతున్నారని చెల్లెలి అత్తింటి వారు చర్చించుకుంటున్నారు. వినోద్‌ను చూడగానే వారికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే వారు వినోద్‌ను సమీపంలోని ఖుద్నేశ్వర్ ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ అతని ముందు తమ ఇంటి ఆడపిల్లను నిలబెట్టారు. 


అక్కడ ఏం జ‌రుగుతుందో అర్థం చేసుకోనే లోపు వినోద్ చేతిలో దండ పెట్టారు. అమ్మాయి మెడలో వేయమ‌ని బ‌ల‌వంతం చేశారు. వినోద్ ప్రతిఘటించినా వినకుండా బలవంతంగా అమ్మాయి మెడలో తాళి కట్టించారు. వినోద్‌కు ఇష్టం లేకుండా పెళ్లి తంతును పూర్తి చేశారు. దీంతో వినోద్ ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు. తనకు బలవంతంగా పెళ్లి చేశారని, అమ్మాయితో కాపురం చేసేది లేదని వినోద్ చెబుతున్నాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. 

Updated Date - 2022-01-31T22:04:08+05:30 IST