Advertisement

బీహార్ రాష్ట్రమంత్రి, ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

Jun 30 2020 @ 09:13AM

పట్నా (బీహార్): బీహార్ రాష్ట్ర మంత్రి దంపతులతో పాటు ఓ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. బీహార్ రాష్ట్ర మంత్రితోపాటు అతని భార్యకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో వారిద్దరిని కటిహర్ హోటల్‌లోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఉత్తర బీహార్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే కరోనా బారిన పడటంతో అతన్ని ఐసోలేషన్ గదికి తరలించారు.గడచిన 24 గంటల్లో 389 మందికి కరోనా సోకింది.


గత 13రోజుల్లో కరోనా రోగుల సంఖ్య రెట్టింపు అయింది. మే 23వతేదీ వరకు 61,220 మందికి పరీక్షలు చేయగా వారిలో 2,263 మందికి కరోనా సోకింది. మే 23 నుంచి జూన్ 5వరకు 91,263 మందికి పరీక్షలు చేయగా 4,451 మందికి కరోనా సోకింది. బీహార్ రాష్ట్రంలో కొవిడ్-19 కేసుల సంఖ్య రెట్టింపు అయిందని బీహార్ ఆరోగ్యశాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సింగ్ చెప్పారు. బీహార్ రాష్ట్రంలోని మధుబనీ జిల్లాలో 153 కరోనా కేసులు, భాగల్ పూర్ జిల్లాలో 138 కేసులు బయటపడ్డాయి. 

Follow Us on:
Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.