మంత్రి ఆబ్సెంట్... తమ్ముడు ప్రెజెంట్

ABN , First Publish Date - 2021-03-06T19:16:22+05:30 IST

ఓ ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రికి బదులు ఆయన సోదరుడు హాజరయ్యారు. ఈ విషయం ప్రస్తుతం బిహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్.

మంత్రి ఆబ్సెంట్... తమ్ముడు ప్రెజెంట్

పాట్నా : ఓ ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రికి బదులు ఆయన సోదరుడు హాజరయ్యారు. ఈ విషయం ప్రస్తుతం బిహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్. దీనిపై సాక్షాత్తూ సీఎం నితీశ్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బిహార్‌లోని హాజీపూర్‌లో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రి ముఖేశ్ సహాని హాజరు కావాల్సి ఉంది. ఆయనకు బదులు ఆయన సోదరుడు సంతోష్ కుమార్ సహానీ హాజరయ్యారు. దీనిపై వివరణ కోరగా... ‘‘మంత్రి బాగా బీజీగా ఉన్నారు. ఆయన ప్రతినిధిగా నేను హాజరయ్యాను.’’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అయితే దీనిపై ముఖ్యమంత్రి నితీశ్ కూడా స్పందించారు. ‘‘ఈ విషయం నాకు తెలియదు. అదే గనక నిజమైతే షాక్‌కు గురి చేసే అంశం. అలాంటి ఘటనలు జరగడం సరికాదు. ఈ విషయాన్ని పరిశీలిస్తా.’’ అని సీఎం నితీశ్ తెలిపారు.


పునరావృత్తం కాకుండా చూసుకుంటా : మంత్రి ముఖేశ్

ఈ వ్యవహారంపై మంత్రి ముఖేశ్ సహానీ స్పందించారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్న కారణంగా కార్యక్రమానికి హాజరుకాలేక పోయానని తెలిపారు. అంతే తప్ప ఆయన్ను పంపించడంలో వేరే దురుద్దేశం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకుంటానని ముఖేశ్ హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-03-06T19:16:22+05:30 IST