హత్యకు ముందు ఆ ఖోఖో ప్లేయర్ పలికిన మూడు మాటలివే!

ABN , First Publish Date - 2021-09-14T16:14:23+05:30 IST

యూపీలోని బిజ్నార్‌లో ఖోఖో నేషనల్ ప్లేయర్...

హత్యకు ముందు ఆ ఖోఖో ప్లేయర్ పలికిన మూడు మాటలివే!

బిజ్నార్: యూపీలోని బిజ్నార్‌లో ఖోఖో నేషనల్ ప్లేయర్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పలు ఆధారాలు లభ్యమయ్యాయి. ఘటన జరిగిన సమయంలో ఆ క్రీడాకారిణికి సంబంధించిన ఆడియో క్లిప్ పోలీసుల చేతికి చిక్కింది. దానిలో ఆమె పలికి మూడు మాటలు వినిపిస్తున్నాయి. ఈ మాటల ఆధారంగా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. ఈ కేసును రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. 


ఈ కేసును ఛేదించేందుకు నాలుగు పోలీసు బృందాలు కృషి చేస్తున్నాయి. వీరికి ఎస్ఓజీ టీమ్ కూడా సహకారం అందిస్తోంది. సంఘటనా స్థలంలో పోలీసులకు ఒక టిఫిన్ బాక్సు కూడా లభ్యమయ్యింది. ఆ క్రీడాకారిణికి పరిచయం ఉన్న ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా పోలీసులకు లభ్యమైన ఫోను రికార్డింగ్‌లో అస్పష్టంగా ఆమె అరుపులు వినిపిస్తున్నాయి. అలాగే సౌరభ్, సుఅర్, అంకుల్ అనే మాటలు కూడా వినిపించాయి. వీటిని పోలీసులు తమ దర్త్యాప్తులో పరిగణలోకి తీసుకున్నారు. బిజ్నార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆ క్రీడాకారిణి పోలీసులకు లభ్యమయ్యింది. తమ కుమార్తెపై ఎవరో అత్యాచారం జరిపి, హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2021-09-14T16:14:23+05:30 IST