Advertisement

స్టార్ట్‌ చేస్తుండగా తగులబడిన ద్విచక్ర వాహనం

Jan 17 2021 @ 00:44AM
దగ్ధమౌతున్న ద్విచక్రవాహనం

దొనకొండ, జనవరి 16 : ద్విచక్ర వాహనం స్టాట్‌ చేసేందుకు కిక్‌ కొట్టగా ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైన ఘటన దొనకొండలోని ప్రదాన రహదారిలో శనివారం జరిగింది. అందిన వివరాల మేరకు సెంట్రింగ్‌ మేస్ర్తీ నందం.ఏడుకొండలుకు చెందిన మోటార్‌సైకిల్‌ను ఆయన వర్కర్‌ భూషణం పనిమీద బజూరుకు తీసుకొని వెళ్లాడు. మోటార్‌సైకిల్‌ ప్రధాన రహదారి పక్కన పార్క్‌ చేసి పని ముగించుకొని వచ్చి మోటార్‌ సైకిల్‌ ఎక్కి స్టాట్‌ చేసేందుకు కిక్‌ కొట్టాడు. వెంటనే బగ్గుమంటూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భూషణం వాహనాన్ని వదిలి పక్కకు పరిగెత్తేలోపు అతని కనుపాపలు, చేతివెంట్రుకలు స్వల్పంగా కాలాయి. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేసే లోపు మోటార్‌ సైకిల్‌ పూర్తిగా కాలిపోయింది. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనకు  ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.