కారును ఢీకొన్న బైక్‌: ఒకరికి గాయాలు

Jul 22 2021 @ 00:00AM
రామాయంపేటలో హైవేపై పల్టీకొట్టిన కారు

రామాయంపేట, జూలై 22: కారును వెనుక నుంచి బెక్‌ ఢీకొట్టిన ప్రమాదంలో   ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన రామాయంపేట-హైదరాబాద్‌ 44వ నంబరు జాతీయ రహదారిపై గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ వైపునకు వెళ్తున్న కారు వెనక నుంచి బైక్‌పై వస్తున్న పున్నాళ్ల ప్రకాశ్‌ బలంగా ఢీకొనడంతో రెండు వాహనాలు అదుపుతప్పి రోడ్డుకిందికి పడిపోయాయి. ఘటనలో ప్రకాశ్‌కు తీవ్ర గాయాలుకావడంతో పోలీసులు ఆంబులెన్సులో హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. 

Follow Us on: