మరదలు బైక్ ఎక్కింది కదా అని తింగరి వేషాలు వేసిన కుర్రాడు.. చివరకు జరిగిందో ఊహించని సంఘటన..!

ABN , First Publish Date - 2021-10-27T03:30:18+05:30 IST

ఎప్పటిలాగానే ఆమె రోడ్డు దాటుతోంది. వీధికి ఇరు వైపులా చూసి.. వాహనాలు ఏవీ రావట్లేదని నిర్ధారించుకున్నాకే ముందుకు అడుగేసింది. కానీ..ఇంతలోనే ఊహించని ప్రమాదం జరిగిపోయింది..!

మరదలు బైక్ ఎక్కింది కదా అని తింగరి వేషాలు వేసిన కుర్రాడు.. చివరకు జరిగిందో ఊహించని సంఘటన..!

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగానే ఆమె రోడ్డు దాటుతోంది. వీధికి ఇరు వైపులా చూసి.. వాహనాలు ఏవీ రావట్లేదని నిర్ధారించుకున్నాకే ముందుకు అడుగేసింది. కానీ..ఇంతలోనే ఊహించని ప్రమాదం జరిగిపోయింది..! ఎక్కడ నుంచి వచ్చిందో తెలిదు కానీ ఓ బైక్ అమితవేగంతో వచ్చి ఆ మహిళను ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించగా బాధితురాలు చికిత్స పొందుతూ మరణించింది. అయితే..యాక్సిడెంట్ చేసిన యువకుడిని పట్టుకున్న స్థానికులు అతడు చెప్పిన విషయాలు విని నివ్వెరపోయారు. అతడి అత్యుత్సాహం వల్లే ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయిందని తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. అతడిని పోలీసులకు అప్పగించారు. బీహార్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఘటన ఇది. 


తన మరదలిని బైక్‌పై ఎక్కించుకున్న ఆనందంలో ఆ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడట. ఎదో పూనకం వచ్చినట్టు అతడు వేగంగా బైక్ పోనిచ్చాడట. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఢీకొన్నాడు. ఫలితంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలో యువకుడు కూడా గాయపడ్డాడు. కాగా.. పోలీసులు మృతురాలిని ఇంద్రావతిగా గుర్తించారు. హథువా జిల్లాలోని మాఛగర్ లాచీరామ్ గ్రామానికి చెందిన ఆమె అదే ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇలా భార్య అకస్మాత్తుగా దూరమవడంతో ఆమె భర్త కన్నీరుమున్నీరవుతున్నారు.

Updated Date - 2021-10-27T03:30:18+05:30 IST