వీఎస్‌యూ ప్రాంగణంలో జీవవైవిధ్య పార్కు

ABN , First Publish Date - 2021-06-24T05:04:21+05:30 IST

జిల్లాలో జీవ వైవిధ్య (బయో డైవర్సిటీ) పార్కు నిర్మాణానికి ప్రణాళిక తయారు చేసినట్లు కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు వెల్లడించారు.

వీఎస్‌యూ ప్రాంగణంలో జీవవైవిధ్య పార్కు
సైన్సు పార్కు నిర్మాణంపై కలెక్టర్‌కు వివరిస్తున్న కమిషనర్‌ దినేష్‌

ప్రభుత్వానికి ప్రతిపాదనలు

కలెక్టర్‌ చక్రధర్‌బాబు 

నెల్లూరు (సిటీ), జూన్‌ 23 : జిల్లాలో జీవ వైవిధ్య (బయో డైవర్సిటీ) పార్కు నిర్మాణానికి ప్రణాళిక తయారు చేసినట్లు కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు వెల్లడించారు. బుధవారం నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో చేపట్టిన సైన్సు పార్కు నిర్మాణాలను ఏపీ బయో డైవర్సిటీ బోర్డు సభ్యుడు, కార్యదర్శి డీ నళిని మోహన్‌,  నెల్లూరు కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌తో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ వీఎస్‌యూ ప్రాంగణంలో బయో డైవర్సిటీ పార్కును నిర్మించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించామని, పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. పట్టణ ప్రాంత ప్రజలను ఇందులో భాగస్వాములను చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. దీంతోపాటు బయో డైవర్సిటీ కమిటీల ఏర్పాటుకు ఉపయోగపడుతుందని చెప్పారు. అంతకుముందు వీఎస్‌యూ అధికారులతో కలిసి పార్కు నిర్మాణ స్థలాలను పరిశీలించి, సమీక్షించారు. అనంతరం నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాల యంలో ఏపీ జీవవైవిధ్య మండలి ఆధ్వర్యంలో యాజమాన్య కమిటీ సమావేశాన్ని నళినీమోహన్‌, దినేష్‌కుమార్‌ నిర్వహించారు. 

Updated Date - 2021-06-24T05:04:21+05:30 IST