బయోమెట్రిక్‌ తప్పని సరి

ABN , First Publish Date - 2021-03-07T04:32:19+05:30 IST

ప్రతి కార్యాలయంలో సిబ్బంది బయోమెట్రిక్‌ తప్పని సరిగా వేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ సూచించారు.

బయోమెట్రిక్‌ తప్పని సరి

ముద్దనూరు మార్చి6: ప్రతి కార్యాలయంలో సిబ్బంది బయోమెట్రిక్‌ తప్పని సరిగా వేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ సూచించారు. మండల పరిధి తిమ్మాపురం గ్రామ సచివాలయాన్ని శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అందులో భాగంగా కార్యాలయ సిబ్బంది హాజరు బయోమెట్రిక్‌ ను పరిశీలించారు. కార్యాలయంలో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్‌  అమర్‌నాథరెడ్డి మూడు రోజులుగా బయోమెట్రిక్‌  వేయకపోవడంతో కడప తన కార్యాలయంలో కలవాలని అధికారులకు సూ చించారు. ఉదయం 10గంటలలోపు, సాయంత్రం 5 గంటలకు రెండు పూట్ల బయోమెట్రిక్‌ తప్పని సరిగా వేయాలన్నారు. హౌసింగ్‌ మంజూరైన లబ్ధిదారులకు రెండు రోజుల్లో జియోట్యా గింగ్‌. మాపింగ్‌, రిజిస్ట్రేషన్‌ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమణారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-03-07T04:32:19+05:30 IST