భలే.. బయోటిన్‌

ABN , First Publish Date - 2021-11-30T08:33:52+05:30 IST

బి విటమిన్లలో కీలకమైన బి7 విటమిన్‌... బయోటిన్‌. నీళ్లలో కరిగే ఈ విటమిన్‌ ఎనర్జీకీ, జీర్ణశక్తికీ అవసరం...

భలే.. బయోటిన్‌

బి విటమిన్లలో కీలకమైన బి7 విటమిన్‌... బయోటిన్‌. నీళ్లలో కరిగే ఈ విటమిన్‌ ఎనర్జీకీ, జీర్ణశక్తికీ అవసరం. ఈ విటమిన్‌ ఉపయోగాలు ఏవంటే....

 ఆహారం మెరుగ్గా జీర్ణమై, పోషకాల శోషణ సక్రమంగా జరుగుతుంది.

 వెంట్రుకలు, గోళ్లు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.

 టైప్‌ 2 మధుమేహం అదుపులో ఉంటుంది.

 నాడీ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. 


బయోటిన్‌ తగ్గితే?

 చర్మం ఎర్రబడి, దురద పెడుతుంది

 వెంట్రుకలు చిట్లి, రాలిపోతూ ఉంటాయి.

 నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంది

 కండరాలు, ఎముకల నొప్పులు వేధిస్తాయి

 అరికాళ్లలో, అరచేతుల్లో తిమ్మిర్లు మొదలవుతాయి.


వేటిలో దొరుకుతుంది?

 కాలేయం, మూత్రపిండాలు (మాంసాహారం)

ఈస్ట్‌

 నట్స్‌, నట్‌ బటర్‌

 కోడి గుడ్డు పచ్చ సొన

 ఆకుకూరలు

కాలీఫ్లవర్‌

పుట్టగొడుగులు

Updated Date - 2021-11-30T08:33:52+05:30 IST