ఎవరు మహారాజు?

ABN , First Publish Date - 2021-11-21T05:30:00+05:30 IST

బీర్బల్‌ ఒకసారి అక్బర్‌ రాయబారిగా పొరుగురాజ్యానికి వెళ్లాడు. ఆ రాజు బీర్బల్‌ గురించి చాలా గొప్పగా విన్నాడు. అయినా ఒకసారి పరీక్షించాలనుకున్నాడు. తనలా మరో పన్నెండు మందికి....

ఎవరు మహారాజు?

బీర్బల్‌ ఒకసారి అక్బర్‌ రాయబారిగా పొరుగురాజ్యానికి వెళ్లాడు. ఆ రాజు బీర్బల్‌ గురించి చాలా గొప్పగా విన్నాడు. అయినా ఒకసారి పరీక్షించాలనుకున్నాడు. తనలా మరో పన్నెండు మందికి ఒకేరకమైన దుస్తులు వేసి, అందరికీ ఒకేరకమైన కిరీటాలను పెట్టి సభలో కూర్చోపెట్టాడు. బీర్బల్‌ సభలోకి ప్రవేశించాడు. గతంలో ఆ రాజును బీర్బల్‌ చూడలేదు. సభలోకి అడుగుపెట్టడంతోనే పదమూడు మంది స్వాగతం పలికారు. తనను పరీక్షిస్తున్నారని బీర్బల్‌కు అర్థమైంది.


ఒకసారి అందరినీ పరీక్షించి చూశాడు. మెల్లగా వెళ్లి ఒకరి దగ్గర ఆగి ‘‘నమస్కారం మహారాజా!’’ అని అన్నాడు. అది చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. ‘‘నేనే రాజును అని ఎలా గుర్తుపట్టారు? ఇంతకుముందు మనం కలుసుకోలేదు కదా!’’ అని అడిగాడు ఆశ్చర్యంగా. ‘‘మహారాజా! మీ ముఖంలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఇతరుల స్పందన కోసం మీరు అటు ఇటూ చూడకుండా నేరుగా చూస్తున్నారు. మహారాజులు మాత్రమే అలాంటి పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. అది చూసి మిమ్మల్ని గుర్తించాను’’ అని అన్నాడు బీర్బల్‌. 

Updated Date - 2021-11-21T05:30:00+05:30 IST