సముద్రంలోని షార్క్‌ను అమాంతం ఎత్తుకెళ్లిన పెద్ద పక్షి

ABN , First Publish Date - 2020-07-08T00:35:54+05:30 IST

చిన్న చిన్న చేప పిల్లలను కొంగలు, గద్దలు ఎత్తుకెళ్లడం కామన్. చెరువులు, కాలువల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూ..

సముద్రంలోని షార్క్‌ను అమాంతం ఎత్తుకెళ్లిన పెద్ద పక్షి

చిన్న చిన్న చేప పిల్లలను కొంగలు, గద్దలు ఎత్తుకెళ్లడం కామన్. చెరువులు, కాలువల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఏకంగా ఓ షార్క్ ను పక్షి ఎత్తుకెళ్లడం చూశారా?. ఏంటి అంతపెద్ద చేపను పక్షి ఎత్తకెళ్లడమా?. అసాధ్యం అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజంగా జరిగింది. ఓ పెద్ద షార్క్ ను భారీ పక్షి ఎత్తుకెళ్లింది. అమెరికాలోని ఓ బీచ్‌లో ఈ ఘటన జరిగింది. బీచ్ లో పర్యటకులు సముద్ర అందాలను ఆశ్వాదిస్తూ జలకాలాటలు ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా ఓ భారీ పక్షి వచ్చింది. సముద్రం మీదకు వచ్చి ఓ షార్క్‌ను అమాంతం ఎత్తుకెళ్లింది. అదేదో పిల్ల చేప కాదు భారీ చేపనే ఆ పక్షి ఎత్తుకెళ్లింది. దాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. 


Updated Date - 2020-07-08T00:35:54+05:30 IST