తెల్లారుతూనే పక్షుల కిలకిలలు... కారణమిదే!

ABN , First Publish Date - 2022-07-13T14:00:57+05:30 IST

తెల్లవారగానే పక్షులు కిలకిలారావాలు...

తెల్లారుతూనే పక్షుల కిలకిలలు... కారణమిదే!

తెల్లవారగానే పక్షులు కిలకిలారావాలు ప్రారంభిస్తాయి. సైన్స్ భాషలో దీనిని హమ్మింగ్ అంటారు. పక్షులు ఉదయాన్నే కిలకిలారావాలు ఎందుకు ఎక్కువగా చేస్తాయి? పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో దీనికి వివిధ కారణాలను చెప్పారు. పక్షులు హమ్మింగ్ చేయడానికి ప్రత్యేక కారణం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏబీసీ నివేదిక ప్రకారం దీనికి ప్రధాన కారణం పక్షులలో హార్మోన్ల హెచ్చుతగ్గులు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం పక్షులలో సాయంత్రం, రాత్రి సమయంలో హార్మోన్ల స్థాయి ఎక్కువగా ఉంటుంది.


ఉదయం సమీపిస్తున్న కొద్దీ ఈ హార్మోన్ స్థాయి వేగంగా తగ్గుతుంది. ఇది నిద్ర ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో అవి కిలకిలారావాలు చేయడం ప్రారంభిస్తాయి. పక్షులు ఇలా చేయడానికి ఆండ్రోజెన్ హార్మోన్ కారణమని మరో పరిశోధన చెబుతోంది. ఆండ్రోజెన్లు సెక్స్ హార్మోన్ల సమూహం. పక్షులలో ఈ హార్మోన్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు, అవి సంభోగం కోసం సిద్ధమవుతాయి. మగ పక్షి ఉదయం పూట పెద్ద గొంతుతో హమ్ చేస్తున్నదంటే దానిలో ఈ హార్మోన్ స్థాయి పెరుగుతునన్నదని పరిశోధనలో తేలింది. ఏప్రిల్ నుండి జూన్ వరకు పక్షుల సంతానోత్పత్తి కాలం. ఈ సమయంలో అవి ఉదయం పూట కిచకిచలు చేస్తాయి. కొన్ని పక్షులు రాత్రిపూట చనిపోతాయని ఒక పరిశోధనలో తేలింది. ఇలా జరిగినప్పుడు ఉదయం, మరొక పక్షి పెద్దగా అరుస్తూ చుట్టుపక్కల ఉన్న పక్షులకు ఈ విషయం తెలియజేస్తుందట.

Updated Date - 2022-07-13T14:00:57+05:30 IST