Birth Day Celebrationsలో స్నేహితుల అత్యుత్సాహం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-04-15T14:11:11+05:30 IST

ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో కొన్ని ప్రత్యేమైన రోజులు ఉంటాయి. వాటిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే రోజుల జాబితాలో బర్త్ డే కూడా ఒకటి. ఈ మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్‌లో స్నేహితులు ఎక్కువగా సందడి

Birth Day Celebrationsలో స్నేహితుల అత్యుత్సాహం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో కొన్ని ప్రత్యేమైన రోజులు ఉంటాయి. వాటిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే రోజుల జాబితాలో బర్త్ డే కూడా ఒకటి. ఈ మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్‌లో స్నేహితులు ఎక్కువగా సందడి చేస్తున్నారు. అన్ని తామై వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. స్నేహితుల ప్రాణాలపైకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఇటువంటి ఘటనే తాజాగా ముంబైలో చోటు చేసుకుంది. స్నేహితులు చేసిన పనికి బర్త్ డే బాయ్.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



అంబర్‌నాథ్‌కు చెందిన 20ఏళ్ల రాహుల్ మౌర్య ఇటీవల పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడి స్నేహితులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోడి గుడ్లతో అతడిపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా స్పార్క్ క్యాండిల్ రాహుల్ చేతిలో ఉన్న సమయంలో చూడటానికి పిండిలాగే ఉండే ఓ తెల్లని పదార్థాన్ని అతడిపై చల్లారు. దీంతో ఒక్కసారిగా మంటు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన కొందరు.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. చివరికి మంటలు అదుపులోకి రావడం వల్ల స్వల్ప గాయాలతో రాహుల్ బయటపడ్డాడు. అయితే ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తతం అదికాస్తా వైరల్‌గా మారింది.   




Updated Date - 2022-04-15T14:11:11+05:30 IST