దూకుడు మీదున్న బిట్‌కాయిన్..అమెజాన్ చూపు పడటమే కారణమా..?

ABN , First Publish Date - 2021-07-27T01:51:21+05:30 IST

క్రిప్టోకరెన్సీ మదుపర్లను ఇటీవల హడలెత్తించిన బిట్‌కాయిన్ క్రమంగా కోలుకుంటోంది. తాజాగా బిట్ కాయిన్ విలువ 40 వేల డాలర్లకు చేరువైంది.

దూకుడు మీదున్న బిట్‌కాయిన్..అమెజాన్ చూపు పడటమే కారణమా..?

ముంబై: క్రిప్టోకరెన్సీ మదుపర్లను ఇటీవల హడలెత్తించిన బిట్‌కాయిన్ క్రమంగా కోలుకుంటోంది. తాజాగా బిట్ కాయిన్ విలువ  40 వేల డాలర్లకు చేరువైంది. సోమవారం నాడు బిట్ కాయిన్ విలువ దాదాపు 12.5 శాతం మేర లాభపడి 39,850 డాలర్లను తాకింది. జూన్ తరువాత ఈ స్థాయిలో ఈ క్రిప్టో కరెన్సీ విలువ పెరగడం ఇదే తొలిసారి. కాగా.. క్రిప్టో మైనింగ్‌పై చైనా ఉక్కుపాదం మోపుతుండటంతో ఇటీవల బిట్‌కాయిన్ విలువ తీవ్ర ఒడిదుడుకులకు లోనైన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో బిట్ కాయిన్ విలువ 30 వేల డాలర్ల దిగువకు పడిపోయి మదుపర్లను హడలెత్తించింది. అయితే.. గత వారం టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ మదుపర్లకు బిట్ కాయిన్‌పై భరోసా కలిగించే వ్యాఖ్యలు చేయడంతో ఈ క్రిప్టో కరెన్సీ మళ్లీ పుంజుకుంది. బిట్ కాయిన్ ద్వారా చెల్లింపులను అనుమతించే విషయాన్ని అమెజాన్ పరిశీలిస్తోందంటూ అంతర్జాతీయ మీడియాలో ఓ వార్త వైరల్ అవడంతో బిట్ కాయిన్‌కు గట్టి మద్దతు లభించినట్టైందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2021-07-27T01:51:21+05:30 IST