శ్రీకృష్ణతో Congress నేతలకు సంబంధాలు

ABN , First Publish Date - 2021-11-21T17:27:14+05:30 IST

రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టిస్తున్న బిట్‌కాయిన్‌ అక్రమాలపై కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య వాక్‌ సమరం తారస్థాయికి చేరింది. ఈ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న శ్రీకృష్ణకు కాంగ్రెస్‌

శ్రీకృష్ణతో Congress నేతలకు సంబంధాలు

- బిట్‌కాయిన్‌ కింగ్‌పిన్‌చే మాదకద్రవ్యాల సరఫరా 

- హోం మంత్రి సంచలన ఆరోపణ 

- రుజువు చేయాలని కాంగ్రెస్‌ నేతల సవాల్‌ 


బెంగళూరు: రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టిస్తున్న బిట్‌కాయిన్‌ అక్రమాలపై కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య వాక్‌ సమరం తారస్థాయికి చేరింది. ఈ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న శ్రీకృష్ణకు కాంగ్రెస్‌ నేతలతోనూ, వారి కుమారులతోనూ అవినాభావ సంబంధాలు ఉన్నాయని హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర కొత్తబాంబు పేల్చారు. దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటపడతాయన్నారు. కలబుర్గిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు రాకేశ్‌తో కింగ్‌పిన్‌ కలసి ఉన్న చిత్రాలను బీజేపీ ఇటీవల విడుదల చేసిన నేపథ్యంలోనే హోం మంత్రి తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బిట్‌కాయిన్‌ వ్యవహారంలో ముఖ్యమంత్రి రాజీనామా తప్పదంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. కాగా బా ద్యత కల్గిన హోంమంత్రి నోటికొచ్చినట్టు నిందలు వేస్తున్నారని కాంగ్రెస్‌ మండిపడింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను చూపాలను హోం మంత్రికి సవాల్‌ విసిరింది. విషయాన్ని తప్పుదారి పట్టించేందుకు మంత్రులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రతిపక్షనేత సిద్దరామయ్య మండిపడ్డారు. 

Updated Date - 2021-11-21T17:27:14+05:30 IST