Shiv Sena పెళ్లి BJPతో ఫిక్సైంది. కానీ..: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2022-05-09T16:40:19+05:30 IST

chief minister పదవి కోసం శివసేన మమ్మల్ని (బీజేపీ) వదిలి పెట్టింది. కానీ మాకు మేముగా శివసేనను వదిలేయలేదు. ఎవరు ఎవరిని వదిలిపెట్టి వెళ్లారని ప్రజలు నిర్ణయిస్తారు. నిజానికి బీజేపీతో పెళ్లి నిర్ణయించబడింది. కానీ వేరే పార్టీతో పారిపోయింది..

Shiv Sena పెళ్లి BJPతో ఫిక్సైంది. కానీ..: కేంద్ర మంత్రి

ముంబై: తరుచూ వివాదాస్పద వ్యాఖ్యాలతో వార్తల్లో తిరగాడే కేంద్ర మంత్రి Raosaheb Danve మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. Shiv Sena, BJP ల మైత్రి ఏనాటిదో తెలిసిందే. అయితే కొంత కాలంగా ఇరు పార్టీలు వైరి పార్టీలయ్యాయి. ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ శివసేన Marriage భారతీయ జనతా పార్టీతో నిర్ణయించబడిందని, అయితే బీజేపీని వదిలేసి వేరే పార్టీతో శివసేన పారిపోయిందంటూ ఆయన అన్నారు. Maharashtra లోని Jalnaలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘chief minister పదవి కోసం శివసేన మమ్మల్ని (బీజేపీ) వదిలి పెట్టింది. కానీ మాకు మేముగా శివసేనను వదిలేయలేదు. ఎవరు ఎవరిని వదిలిపెట్టి వెళ్లారని ప్రజలు నిర్ణయిస్తారు. నిజానికి బీజేపీతో పెళ్లి నిర్ణయించబడింది. కానీ వేరే పార్టీతో పారిపోయింది’’ అని దాన్వే అన్నారు. ఇక ముఖ్యమంత్రి Uddhav Thackeray ను నేరుగా ప్రస్తావిస్తూ ‘‘బీజేపీ-శివసేన కూటమికి (2019అసెంబ్లీ ఎన్నికలు) ప్రజలు ఓట్లేశారు. కానీ నువ్వు (ఉద్ధవ్ థాకరే) ప్రజా తీర్పును కాలరాసి కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపావు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఇప్పుడు నీ రోజులు బాగానే ఉన్నాయేమో.. కానీ 12 కోట్ల మహారాష్ట్రీయుల రోజులను నాశనం చేస్తున్నారు’’ అని అన్నారు.


బీజేపీ-శివసేన మైత్రి రెండు దశాబ్దాలకు పైగా కొనసాగింది. దేశంలో అతిపురాతన రాజకీయ పొత్తులో ఇది ఒకటి. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇరు పార్టీల మధ్య ముఖ్యమంత్రి పదవి విషయంలో విబేధాలు వచ్చాయి. దీంతో బీజేపీ నుంచి శివసేన విడిపోయి కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకుని మహా వికాస్ అగాఢీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి తరపున శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అయ్యారు.

Read more