బీసీలకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ అన్యాయం

ABN , First Publish Date - 2022-08-10T05:19:55+05:30 IST

రాష్ట్రంలో అధిక సంఖ్యా కులైన బీసీలను బీజేపీ, టీఆర్‌ఎస్‌లు మోసం చేస్తున్నాయని, చట్టసభలో 60శాతం ఉండాల్సిన బీసీలలో 22శాతం మాత్రమే ఉన్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆరోపిం చారు.

బీసీలకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ అన్యాయం
జై భీమ్‌ ప్రతిజ్ఞ చేయిస్తున్న నాయకులు

- ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణతో ఊడుతున్న ఉద్యోగాలు 

- గద్వాల బీసీ గర్జనలో ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌


గద్వాల, ఆగస్టు 9: రాష్ట్రంలో అధిక సంఖ్యా కులైన బీసీలను బీజేపీ, టీఆర్‌ఎస్‌లు మోసం చేస్తున్నాయని, చట్టసభలో 60శాతం ఉండాల్సిన బీసీలలో 22శాతం మాత్రమే ఉన్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆరోపిం చారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన బీసీ గర్జనకు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బహుజన సమాజ్‌ పార్టీ 60 నుంచి 70 శాతం సీట్లను బీసీలకే కేటాయిస్తుందని హామీ ఇచ్చారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుండడంతో చాలామంది బీసీల ఉద్యోగాలు ఊడుతున్నాయని వాపోయారు. కేవలం 10శాతం మందితోనే వంద శాతం సంపద ఉండటాన్ని బీఎస్పీ ప్రశ్నిస్తుందని అన్నారు. త్వరలో గద్వాలలో రెండు లక్షల మం దితో సభను పెట్టి బహుజనుడిని గెలిపించుకుంటా మని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బహుజన సమాజ్‌ పార్టీకి రాజ్యాధికారం ఇస్తే ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమిని ఇస్తామని, అంత ర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తానని, అసైన్డ్‌, పోడు భూములకు పట్టాలి స్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ఆయన కలెక్టరేట్‌ నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌కు పూలమాల వేసి ని వాళ్లు అర్పించారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి మౌలానషఫీ మసూద్‌అక్బర్‌, మహిళా కన్వీనర్‌ రాములమ్మ, జిల్లా ఇన్‌చార్జి కేశవరావు, ఉపాధ్యక్షుడు మణికుమార్‌, కార్యదర్శి రేపల్లి రాజు, కనకం బాబు, ఏసురాజు, చైతన్న, కిరణ్‌, రవికుమార్‌, తదితరులున్నారు. 

Updated Date - 2022-08-10T05:19:55+05:30 IST