
హైదరాబాద్: బోధన్‌లో రాళ్ల దాడిని బీజేపీ ఖండిస్తోందని ఆ పార్టీ నేత బండి సంజయ్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోధన్ చౌరస్తాలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు.. మున్సిపల్ కౌన్సిల్ అనుమతిచ్చిందని తెలిపారు. హనుమాన్ భక్తులపై అన్యాయంగా లాఠీచార్జి చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కొందరు ఐపీసీలు పని చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు.
బోధన్‌లో శివాజీ విగ్రహాం ఏర్పాటుపై వివాదం నెలకొంది. శివసేన, బీజేపీ కార్యకర్తలు రాత్రికి రాత్రి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీంతో మైనార్టీకి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు. ఘటన ప్రదేశానికి ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా చేరుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసుల రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మొహరించారు.
ఇవి కూడా చదవండి