నన్ను బీజేపీ బెదిరించలేదు: అభిషేక్ బెనర్జీ

ABN , First Publish Date - 2021-03-06T22:21:34+05:30 IST

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులను ఉసిగొల్పడం ద్వారా తనను బీజేపీ..

నన్ను బీజేపీ బెదిరించలేదు: అభిషేక్ బెనర్జీ

వెస్ట్ మిడ్నాపూర్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులను ఉసిగొల్పడం ద్వారా తనను బీజేపీ బెదిరించ లేదని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. ఒక నేత విషయంలో బీజేపీ ఇదే పని చేసిందని, తన విషయంలో మాత్రం ఈ బెదిరింపులు సాగవని పేర్కొన్నారు.


వెస్ట్ మిడ్నాపూర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ... 'బెదిరించి ఆయనను (సువేందు అధికారి) బీజేపీలోకి లాక్కుకున్నట్టు నన్ను కూడా ఈడీ, సీబీఐలతో బెదిరించ గలమని వాళ్లు (బీజేపీ) అనుకుంటున్నారా? మేమిద్దరం మనుషులమే. కానీ మా వెన్నెముకల్లో వ్యత్యాసం ఉంది. ఆయన (సువేందు) తన వెన్నెముకను అమ్ముకున్నారు. నేను మాత్రం నా వెన్నెముకను అమ్మకానికి పెట్టను. వాళ్లు కొనుగోలు చేయనూ లేరు' అంటూ బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. తన గొంతు కోసినా  'జై హింద్, జై బంగ్లా, జై మిడ్నాపూర్, జై మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ జిందాబాద్' నినాదాలు మాననని మరోసారి ఆయన స్పష్టం చేశారు. బొగ్గు కుంభకోణంలో ఇటీవల సీబీఐ బృందం అభిషేక్ నివాసానికి వెళ్లి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆయన భార్యకు నోటీసులు ఇచ్చారు. జైలు పేరు చెప్పి బెంగాల్ ప్రజల్ని బెదరించలేరంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ పరిణామాలపై వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-03-06T22:21:34+05:30 IST