హెచ్‌ఐసీసీలో బీజేపీ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం

Published: Mon, 27 Jun 2022 15:46:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హెచ్‌ఐసీసీలో బీజేపీ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం

హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ జాతీయ సమావేశాలకు సంబంధించిన కార్యాచరణలో భాగంగా హెచ్‌ఐసీసీలో బీజేపీ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.అన్ని శాఖల అధికారులతోబీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్, శివకుమార్ తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు.జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో పలువురు నాయకులు అధికారులతో భేటీఅయి ఏర్పాట్లపై చర్చించారు. సమావేశాల సందర్భంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.