Uttar Pradesh: తాజ్ మహల్ పేరు మారబోతోందా?

ABN , First Publish Date - 2022-08-31T21:26:07+05:30 IST

తాజ్ మహల్ (Taj Mahal) పేరును తేజో మహాలయ (Tejo

Uttar Pradesh: తాజ్ మహల్ పేరు మారబోతోందా?

ఆగ్రా : తాజ్ మహల్ (Taj Mahal) పేరును తేజో మహాలయ (Tejo Mahalaya)గా మార్చాలని బీజేపీ కౌన్సిలర్ శోభారామ్ రాథోడ్ (Shobharam Rathore) ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఆయన బుధవారం ఆగ్రా నగర పాలక సంస్థ (Agra Municipal Corporation)కు సమర్పిస్తారు. దీనిపై నగర పాలక సంస్థ సభ్యులు తదుపరి నిర్ణయం తీసుకుంటారు. 


తాజ్ మహల్‌లో కమలంతో కూడిన కలశం ఉన్నట్లు రుజువులు తన వద్ద ఉన్నాయని శోభారాం రాథోడ్ తన ప్రతిపాదనలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 


తాజ్ మహల్ గురించి అసలు నిజాలు తెలుసుకునేందుకు దానిలో తాళాలు వేసి ఉన్న 22 గదులను తెరవాలని కొన్ని నెలల క్రితం అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దానిని హైకోర్టు తోసిపుచ్చింది. 


ఇదిలావుండగా, తాజ్ మహల్ వాస్తవానికి ఓ శివాలయమని, ఈ విషయాన్ని ప్రాచీన గ్రంథాలు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రికార్డులు చెప్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మాట్లాడుతూ, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజ్ మహల్ పేరును రామ్ మహల్‌గా మార్చుతుందని చెప్పారు. 


Updated Date - 2022-08-31T21:26:07+05:30 IST