చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-08-08T06:18:27+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం 75 సంవత్సరాల దేశ వాస్తవిక చరిత్రను వక్రీక రించి ప్రజలను మభ్య పెడుతోందని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాక ర్‌ అన్నారు.

చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ ప్రభుత్వం
సిరిసిల్లలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

-  ప్రభుత్వ కంపెనీలను ఆదాని, అంబానీలకు కట్టబెట్టేందుకు మోదీ యత్నం

- కరీంనగర్‌ ఎంపీ  జోకర్‌లా మారారు - మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 7: కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం 75 సంవత్సరాల దేశ వాస్తవిక చరిత్రను వక్రీక రించి ప్రజలను మభ్య పెడుతోందని కరీంనగర్‌  మాజీ ఎంపీ పొన్నం ప్రభాక ర్‌ అన్నారు. ఆదివారం సిరిసిల్ల పట్టణం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాస్తవిక చరిత్రను మభ్యపెట్టే విధంగా వ్యవహారాలు చేస్తుందని అన్నారు. దీనికి గాను కాంగ్రెస్‌ పార్టీ స్వాతంత్య్రం సాధించేందుకు ఎలా త్యాగాలు చేసిందో ఈ తరానికి చెబుతుందన్నారు. భారత చరిత్ర లో తొలి ప్రధాన మంత్రిగా నెహ్రూ ముందు చూపుతో పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టారని చెప్పారు. దీంతో వ్యవసాయక, పారిశ్రామిక విప్లవం, విద్య, వైద్య రంగాలలో చేపట్టిన వివిధ అంశాల వల్లే ఈ రోజు కొన్న లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలను ఎగుమతి చేసుకునే స్థాయికి ఎదగామన్నారు. ప్రాజెక్టులు, పరిశ్ర మలను, విద్య, వైద్యాలయాలను ఏర్పాటు చేసుకు న్నామన్నారు. వీటన్నింటిని తామే చేశామన్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.  సాంకేతికంగా ప్రపంచంతో పోటీ పడుతున్నామంటే నాటి ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ కారణం అన్నారు. కరీంనగర్‌ ముద్దు బిడ్డ పీవీ నర్సింహారావు, ఆర్థిక వేత్త  మన్మోహన్‌సింగ్‌లు ప్రధాన మంత్రులుగా ఉన్న సమయంలో ఆర్థిక మాంధ్యం రాకుండా పలు సంస్కరణలు చేయడం వల్లే నేడు భారత దేశం నిలదొక్కుకుందని అన్నారు. ఈ నాటి  తరానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఈ అంశాలను వివరిస్తుందన్నారు. విదేశాలలో మూలుగున్న నల్లదనా న్ని దేశానికి తెప్పించి ప్రతీ పౌరుడి ఖాతాలో రూ. 15వేలు వేస్తానని మోదీ మోసం చేశారని చెప్పారు.. దేశ ప్రజల జీవితాలనే బాగు చేస్తామన్న ప్రధాన మంత్రి పెట్రోల్‌, డీజీల్‌, వంట గ్యాస్‌, నిత్యవసర సరుకుల ధరలను పెంచి, జీఎస్టీ ద్వారా ప్రతి కుటుంబం నుంచి రూ. 15వేలు గుంజుతున్నారని ఆరోపించారు. నాడు నెహ్రూ దేశంలో పరిశ్రమలు తీసుకొస్తే నేటి ప్రధాన మంత్రి మోదీ దేశంలోని 100 కంపెనీలను ఆదాని, అంబానీలకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఉప ఎన్నికలు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే చనిపోతేనే రావాలని కాని బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉప ఎన్నికల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. ఉప ఎన్నికల ద్వారా తెలంగా ణలో రాజకీయ బలాన్ని పెంచుకోవాలని అనుకోవడం తప్పుడు చర్య అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన బీజేపీ ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తారని ప్రశ్నించారు. తెలంగాణ విభజన హామీలను అమలు చేయాలన్నారు.

-అమలుకు నోచుకోని హామీలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిరిసిల్ల, వేములవాడ నియోజక వర్గాలలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. సిరిసిల్ల ఎగువమానేరు, వేములవాడ దేవాలయంకు, ముంపు గ్రామాలకు ఇచ్చిన హామీలను ఇప్పటికి నేరవే ర్చలేదన్నారు. కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో మరమగ్గాల ను అమ్ముకుని ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతను ఇవ్వాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదని మండిపడ్డారు. వీటిపై కూడ ప్రజలతో కాంగ్రెస్‌ పార్టీ చర్చిస్తుందన్నారు.  కరీంగనర్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీలు, 38 మండలాలు, ఏడు మున్సిపాల్టీలు, ఒక కార్పొరోషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజ యం సాధించేందుకు ప్రజల్లోకి వెళుతామని తెలిపారు.

- అవినీతిని ప్రజల ముందు ఉంచుతాం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొడుకు నియోజకవర్గం సిరిసిల్లలో సిమెంట్‌ కట్టడాల వెనకాల ఉన్న అవినీతిని ప్రజల ముందు ఉంచతామని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. చేనేత పరిశ్రమపైనే కూడా కేంద్రం నుంచి జీఎస్టీ పన్నులు పడుతున్నాయని అన్నారు. నాడు బడ్జెట్లో పెట్టిన క్లస్టర్‌ కేజును కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు సిరిసిల్లకు తీసుకురాక పోవడం అసమర్దతకు నిదర్శనమన్నారు. పార్లమెంట్‌ పరిధిలోని నేత కార్మికులు, రైతుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. కేవలం భాగ్యనగర్‌ చుట్టు తిరిగితే నేను బాగుంటాను అన్న పరిస్థితులలో ఉంటూ ఒక జోకర్‌లా మారారని  ఆరోపించారు. కేసీఆర్‌ను జైళ్లో పెడతాం, కేటీఆర్‌ అవినీతి పరుడు అంటూ ఒక జోకర్‌గా మాట్లాడడం తప్పా చేసింది ఏమిలేదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినీ సందర్భంగా ఏఐసీసీ ఆధేశాల మేరకు ఆజాదీకా అమృత్‌ ఉత్సవాలలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 9 గంభీరావుపేట పెద్దమ్మ చౌరస్తా నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 18న ఇల్లంతకుం టకు చేరుకోవడంతో పాదయాత్ర ముగుస్తుందని అన్నారు. జిల్లాలోని కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర కొనసా గుంతని  చెప్పారు.  ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి వెంగళ అశోక్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, పట్టణ అధ్యక్షుడు నక్క నర్సయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, వివిధ మండ లాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-08T06:18:27+05:30 IST