
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఎండగట్టాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర వైఖరిని రైతులకు వివరించాలన్నారు. ధాన్యం కొనుగులు బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఒక్క తెలంగాణ వడ్ల విషయంలోనే వివక్ష ఉందని ఆక్షేపించారు. ప్రతి ఇంటిపై నల్ల జెండాలతో నిరసన తెలపాలని హరీష్‌రావు పిలుపునిచ్చారు.
మరోవైపు యాసంగి వరిధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఆందోళన బాట పట్టిన అధికార టీఆర్ఎస్.. అందుకు సన్నాహకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ పార్టీ సమావేశాలు నిర్వహించారు. శుక్ర, శనివారం ఆందోళనలు చేపట్టబోతోంది. ఇటీవల నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో శ్రేణులకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఒక్క అంశంపైనే పొరాడాలనుకున్న అధికార పార్టీకి కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన వంటగ్యాస్, పెట్రో ధరలు కూడా మరో ఆయుధంగా మారాయి.
ఇవి కూడా చదవండి