
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ ''రహస్య పర్యటనల'' సమయంలోనే కీలక ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనిని ''గుప్త ప్రయోగం''గా ఆయన అభివర్ణించారు. గత మూడేళ్లుగా వివిధ ఘటనలు రాహుల్ విదేశీ పర్యటనల సమయంలోనే చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు. ఇది ''గుప్త్ ప్రయోగ్'' (రహస్య ప్రయోగం) అని ఓ ట్వీట్లో సంబిత్ పాత్ర పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన గ్రాఫిక్స్‌ను ఆయన షేర్ చేశారు. ఢిల్లీ అల్లర్లు, రెడ్ ఫోర్ట్ హింసాకాండ, ప్రధాని భద్రతా లోపం...వంటి సంఘటనలను ఈ గ్రాఫ్‌లో ఆయన సూచించారు. రాహుల్ గాంధీ దేశంలో లేనప్పుడే ఈ ఘటనలు జరిగాయని, ఇది గుప్త ప్రయోగమని అన్నారు.
ఇవి కూడా చదవండి
రాహుల్ గాంధీ 2020లో రహస్య పర్యటన జరిపినట్టు ఢిల్లీ అల్లర్లు చూశామని, 2021లో రాహుల్ అజ్ఞాత పర్యటనకు వెళ్లినప్పుడు ఎర్రకోట అల్లర్లు జరిగాయని, 2022లో రాహుల్ అలా వెళ్లినప్పుడే ప్రధాని పర్యటనలో భారీ భద్రతా లోపం చోటుచేసుకుందని ఆ ట్వీట్లో సంబిత్ పాత్ర ఆరోపించారు. కాగా, సంబిత్ పాత్ర ట్వీట్‌పై కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.