సీఎం భార్యపై ట్వీట్.. బీజేపీ ఐటీ సెల్ సభ్యుడు అరెస్ట్

ABN , First Publish Date - 2022-01-07T01:10:57+05:30 IST

తన క్లైంట్‌కు పంపించిన ఫిర్యాదు కాపీలో ఎలాంటి కారణం లేకుండా పోలీస్ స్టేషన్‌కు పిలుపించుకుని నిర్భంధించారు. నిబంధనల ప్రచారం హాజరైన నా క్టైంట్‌ను రకరకాల ప్రశ్నలతో గంటకు పైగా ఇబ్బంది పెట్టారు..

సీఎం భార్యపై ట్వీట్.. బీజేపీ ఐటీ సెల్ సభ్యుడు అరెస్ట్

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మి థాకరేపై అభ్యంతరకరంగా ట్వీట్ చేసిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ వ్యక్తి జితెన్ గజారియా అని, అతడు భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ విభాగానికి చెందిన వ్యక్తని పోలీసులు వెల్లడించారు. రష్మి థాకరేపై జనవరి 4న ‘మరాఠీ రబ్రీ దేవి’ అంటూ కామెంట్ చేశాడు. దీనికి అనుబంధంగా ‘బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ కుంభకోణంలో ఇరుకున్నప్పుడు ముఖ్యమంత్రి పదవిని రబ్రీదేవి చేపట్టారు. ఇక్కడి పరిస్థితి ఇలాగే ఉంది. ఉద్ధవ్ థాకరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏమో సీఎం భార్య మరో రబ్రీదేవి కావొచ్చు’ అంటూ రాసుకొచ్చాడు.


అయితే బీజేపీ కార్యదర్శి, గజారియా తరపు న్యాయవాది వివేకానంద గుప్త మాట్లాడుతూ ‘‘తన క్లైంట్‌కు పంపించిన ఫిర్యాదు కాపీలో ఎలాంటి కారణం లేకుండా పోలీస్ స్టేషన్‌కు పిలుపించుకుని నిర్భంధించారు. నిబంధనల ప్రచారం హాజరైన నా క్టైంట్‌ను రకరకాల ప్రశ్నలతో గంటకు పైగా ఇబ్బంది పెట్టారు’’ అని అన్నారు.

Updated Date - 2022-01-07T01:10:57+05:30 IST