క్షేత్రస్థాయికి బీజేపీ కీలకనేతలు

ABN , First Publish Date - 2022-06-30T06:09:43+05:30 IST

రానున్న సాధారణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్రంలో పావు లు కదుపుతోంది. అందుకు అనుగుణంగా గత ఏడాది కాలంగా వరుస కార్యక్రమాలు చేపట్టింది. జూలై 2వ తేదీ నుంచి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భం గా హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

క్షేత్రస్థాయికి బీజేపీ కీలకనేతలు

నేడు, రేపు నియోజకవర్గాల్లో పర్యటన

పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సన్నద్ధం 


నల్లగొండ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రానున్న సాధారణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్రంలో పావు లు కదుపుతోంది. అందుకు అనుగుణంగా గత ఏడాది కాలంగా వరుస కార్యక్రమాలు చేపట్టింది. జూలై 2వ తేదీ నుంచి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భం గా హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ అంశాలను అవకాశంగా తీసుకుని పోలింగ్‌ బూత్‌స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందు లో భాగంగా కేంద్ర మంత్రులు గురువారం, శుక్రవారం వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మొదటి రోజు నియోజకవర్గ బీజేపీ అనుబంధ మోర్చాల నాయకులతో, బూత్‌ కమిటీల ఇన్‌చార్జీలతో సమావేశం కానున్నారు. రెండో రోజు మిగిలిపోయిన మోర్చాల నాయకులతో, సంఘ్‌ పరివా ర్‌ నేతలతో సంప్రదింపులు జరపనున్నారు. ఈ రెండు రోజులు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ మొదలు రాత్రి భోజనం వరకు ఒక ఎస్సీ, ఎస్టీ, మైనారీ, బీసీల నాయకులు, కార్యకర్తల ఇళ్లల్లో కేంద్ర మంత్రులు, కీలక నేతలు భోజనాలు చేసేలా, అదేవిధంగా స్థానికంగా దేవాలయాల్లో పూజల్లో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు.  ప్రతీ నియోజకవర్గానికి కేంద్ర మంత్రి లేదా పార్లమెంట్‌ సభ్యుడు ఎమ్మెల్సీలకు బాధ్యతలు ఇవ్వగా, వీరికి నియోజకవర్గ కోఆర్డినేటర్లు, సహాయకులు సహకారం అందించనున్నారు. 


జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో.. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా కేంద్రమాజీ మంత్రులు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో జూన్‌ 30, జూలై 1వ తేదీన భువనగిరి నియోజకవర్గంలో ప్రియా సేతి పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గంలో మాజీ కేంద్రమంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటించాల్సి ఉండగా, అనివార్య కారణాలవల్ల ఆయన రావడంలేదు. ఆయన స్థానంలో పశ్చిమబెంగాల్‌ ఎంపీ రాజుబిస్తా హాజరుకానున్నారు. 


నియోజకవర్గాల వారీగా నేతల పర్యటన

నియోజకవర్గం హాజరుకానున్న నేత

దేవరకొండ జష్‌కాపూర్‌ మీనా (ఎంపీ)

నాగార్జునసాగర్‌ అరుణ్‌ చతుర్వేది 

మిర్యాలగూడ సుధీర్‌ మంగంటివార్‌ (ఎమ్మెల్యే)

హుజూర్‌నగర్‌ రాజ్‌కుమార్‌ చహర్‌ (ఎంపీ)

కోదాడ రణ్‌మీర్‌ సింగ్‌ బిదూరి

సూర్యాపేట వీకేసింగ్‌, రిటైర్డు జనరల్‌ (ఎంపీ)

నల్లగొండ సుదాంశు త్రివేది 

మునుగోడు పీకే కృష్ణదాస్‌ 

భువనగిరి ప్రియా సేతి

నకిరేకల్‌ ప్రతిమ బౌమిక్‌

తుంగతుర్తి సునీతా దుగ్గల్‌ (ఎంపీ)

ఆలేరు రాజు బిస్తా (ఎంపీ)

Updated Date - 2022-06-30T06:09:43+05:30 IST