
హైదరాబాద్: తెలంగాణలో నియంత పాలనకు చరమగీతం పాడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్రంపై కావాలనే కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ కొత్త కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎంతమంది పీకేలు వచ్చినా మోదీ సర్కార్ను ఏం చేయలేరని ఆయన అన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తరిమివేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి