
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. డిప్రేషన్తోనే కేసీఆర్ ప్రెస్మీట్లు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బుధవారం ఢిల్లీ వేదికగా బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం అయ్యింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన జరుగుతోందని విమర్శించారు.కేసీఆర్ సీఎం అయ్యాక 145 రోజులు ఫామ్‌హౌస్‌లో పండుకున్నారన్నారు. 1200 మంది ఆత్మబలిదానాలతోనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. అధికారం మాత్రం ఒకే కుటుంబం చేతుల్లో చిక్కుకుందని విమర్శించారు. ఆత్మబలిదానం చేసుకున్నవారి కుటుంబాలు ఈ విషయాన్ని ఆలోచించాలన్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడతామని కేంద్రం చెప్పలేదన్నారు. మీటర్లు పెట్టాలని కేంద్రం ఇప్పటి వరకు ఆదేశించలేదని... కావాలనే బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
ఉచిత విద్యుత్ సరఫరాకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. డిస్కంలకు చెల్లించాల్సినవాటికీ ఇప్పటికీ చెల్లించలేదని తెలిపారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలవుతోందన్నారు. టెన్ జన్‌పథ్ స్క్రిప్ట్‌నే కేసీఆర్ చదువుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని... అందుకే సర్జికల్ స్ట్రయిక్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి