
న్యూఢిల్లీ: త్వరలో పాతబస్తీ ఫైల్స్, అవినీతి ఫైల్స్ బయటకు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... సీఎంకు పనిపాట లేక గంటల తరబడి మీడియా సమావేశం పెడుతున్నారన్నారు. వయోభారం కారణంగా కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని యెద్దేవా చేశారు. సమస్యలు సృష్టించి ప్రజల దృష్టిని ప్రభుత్వంపై నుండి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. పారా బాయిల్డ్ రైస్ ఇవ్వమని.. కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పి...తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర విధానం లేకనే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. వర్షాకాలంలో ఇవ్వాల్సిన పంట ఇంకా ఇవ్వలేదన్నారు. ఇండియా గేట్ దగ్గర ధాన్యం పోస్తా అన్నారు ఏమైందని బీజేపీ అధ్యక్షుడు ప్రశ్నించారు. పాక్, చైనాలకు అనుకూలంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవినీతి యూపీఎ పాలనలో కేంద్రమంత్రిగా కేసీఆర్ భాగస్వామి అని తెలిపారు. కాశ్మీర్ ఫైల్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడే సీఎంకి డీఎన్ఎ టెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ఖాన్‌కు ఉన్న బుద్ధి కేసీఆర్‌కు లేదని దుయ్యబట్టారు.
ధాన్యం కొనేది లేదని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు. అన్ని రాష్ట్రాల్లో కొన్నట్లే తెలంగాణలోనూ కేంద్రం వడ్లుకొంటుందని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రైతులు వడ్లు మాత్రమే పండిస్తారని, బాయిల్డ్ రైస్ పండించరని స్పష్టం చేశారు. ఒక మధ్యవర్తిగా రాష్ట్రంలో కేసీఆర్ వడ్లు కొనాల్సిందే అని అన్నారు. వడ్లు కొన్నందుకు కేసీఆర్‌కు కమీషన్ కూడా వెళ్తుందన్నారు. మొన్నటి వరకూ ముందస్తుకు వెళ్తామన్నారని... ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ షాక్ తిన్నారని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు
ఇవి కూడా చదవండి