
కరీంనగర్: రాజకీయాల కోసం జై హనుమాన్ అంటే.. దేవుడు క్షమించడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రామమందిర నిర్మాణానికి అనుకులమో లేదో అయ్యా, బిడ్డ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ వల్లే.. తాను హిందువును అని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారన్నారు. కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో అని పంజాబ్ రైతులకు అనుమానం ఉందని తెలిపారు. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు రావడమే అతిపెద్ద సంచలనమని వ్యాఖ్యానించారు. దేశ యాత్రలతో కేసీఆర్ సాధించింది ఏమీ లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి