
సూర్యాపేట: తెలంగాణను శ్రీలంకతో పోల్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay)పై మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish reddy) మండిపడ్డారు. శ్రీలంకలాగా మారింది గుజరాత్, యూపీ రాష్ట్రాలే... తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. ఆకలి ఇండెక్స్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ తరవాతి స్థానంలో భారత్ ఉందంటే అందుకు బీజేపీ వైఫల్య పాలనే కారణమని విమర్శించారు. బీజేపీ పాలనలో భారత్ సోమాలియాగా మారినా ఆశ్చర్యం లేదన్నారు. తెలంగాణా పథకాలను మొన్నటి వరకు మెచ్చుకుని ఇప్పుడు ఓట్ల రాజకీయం కోసం తెలంగాణాపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణా పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కావాలని అక్కడి ప్రజలు అడుగుతుండటంతోనే తెలంగాణాను చీకట్లో నెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీ నుండి బీజేపీని గద్దె దింపుతేనే దేశ ప్రజల ఆకలి తీరుతుందని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి