
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో పదాధికారుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ప్రజా సంగ్రామయాత్ర, వడ్లు కొనుగోలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ప్రజా సంగ్రామయాత్ర నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమలపై నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం చేయనున్నారు. వడ్ల కొనుగోలు అంశంలో టీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టే అంశంపై చర్చ జరుగనుంది. ఇప్పటికే వడ్లు కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్ళే అంశాన్ని నేతలు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, విజయశాంతి, వివేక్, స్వామి గౌడ్, గరికపాటి తదితరులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి