
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై అధిక భారం మోపారన్నారు. డిస్కంలకు రూ.48 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ శాఖలు వాడుకునే విద్యుత్‌కు బిల్లులు చెల్లించడంలేదని... మరోవైపు పాతబస్తీలో బిల్లులు వసూలు చేసే దమ్ములేదని యెద్దేవా చేశారు. ఈ లోటును పూడ్చుకునేందుకు ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. దీనిపై రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి