Rajagopal Reddy: రేవంత్ రెడ్డి ఓ పెద్ద బ్లాక్‌మెయిలర్

ABN , First Publish Date - 2022-09-05T04:21:11+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Tpcc Chief Revanth Reddy)పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి....

Rajagopal Reddy: రేవంత్ రెడ్డి ఓ పెద్ద బ్లాక్‌మెయిలర్

నల్లగొండ: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Tpcc Chief Revanth Reddy)పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Bjp leader Komati Reddy RajaGopal Reddy) ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఓ పెద్ద బ్లాక్‌మెయిలర్ అని.. సమాచార హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకుని వందల కోట్లు వెనకేసుకున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ లాంటి అవినీతిపరుడికి పీసీసీ ఇవ్వడం దారుణమన్నారు. తన జోలికొస్తే రేవంత్‌ చరిత్ర మొత్తం బయటపెడతానని హెచ్చరించారు. తనకు జెండాలు అవసరం లేదని.. ఇండిపెండెంట్‌గా నైనా గెలుస్తానని రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-09-05T04:21:11+05:30 IST