జగన్ పాలనలో అతి గతి లేదు: Lanka dinakar

ABN , First Publish Date - 2021-10-22T16:48:53+05:30 IST

"ప్రధాని గతి శక్తి" ద్వారా భారత దేశ గతి సమ్మిళిత అభివృద్ధి, ఉద్యోగ మరియు ఉపాధి కల్పన వైపు దూసుకెళుతోందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.

జగన్ పాలనలో అతి గతి లేదు: Lanka dinakar

అమరావతి: "ప్రధాని గతి శక్తి" ద్వారా భారత దేశ గతి సమ్మిళిత అభివృద్ధి, ఉద్యోగ మరియు ఉపాధి కల్పన వైపు దూసుకెళుతోందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. దేశంలో 100 కోట్ల వాక్సినేషన్ పూర్తి అయిన రోజే 100 లక్షల కోట్ల రూపాయల " ప్రధాని గతి శక్తి " ప్రాజెక్టులను కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలపడం సంతోషకరమన్నారు. భారత దేశంలో మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం " ప్రధాని గతి శక్తి" అంటుంటే, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలనలో "అతి గతి" లేదని విమర్శించారు. ఇప్పటికే అప్రూవ్ అయిన 42 లక్షల కోట్ల భారత మౌలిక సదుపాయాల పైప్లైన్ (NIP)లో ఆంధ్రప్రదేశ్ కోసం జగన్ ఏన్ని ప్రాజెక్టులు అప్లై చేశారని ప్రశ్నించారు. జగన్ రాష్ట్ర అభివృద్ధి కన్నా వ్యక్తిగత కక్ష్యలను తీర్చుకొనేందుకు సమయం వృథా చేస్తున్నారని అన్నారు. దేశంలో మోడీ పాలనలో దార్శనికుడుగా పేరు ప్రఖ్యాతులు గడిస్తే, రాష్ట్రంలో జగన్ పాలనలో దయనీయ పరిస్థితిలోకి నెట్టిన పేరు ప్రఖ్యాతులు గడిoచారని లంకా దినకర్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-22T16:48:53+05:30 IST